ఏపీలో జూన్ 17 నుంచి టెన్త్ పరీక్షలు..!

ఏపీలో 2020-21 విద్యా సంవత్సరంలో టెన్త్ పబ్లిక్ పరీక్షలను జూన్ 17వ తేదీ నుంచి నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అలాగే పరీక్షలను 7 పేపర్లకు పరిమితం చేయనున్నారు. కోవిడ్ కారణంగా స్కూళ్లలో తరగల నిర్వహణ 5 నెలలు ఆలస్యంగా నవంబర్ 2 నుంచి ఆరంభమైన నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

గతేడాది 11 పేపర్లను 6కు కుదించి పరీక్షలు నిర్వహించారు. గతేడాది మాదిరిగానే ఈసారి పేపర్ల సంఖ్యను 7కు కుదించారు. గతేడాది భాషా పేపర్లతో పాటు సబ్జెక్టు పేపర్లను కలిపి 6కు కుదించడం జరిగింది. ఈ సారి భాషా పేపర్లు, సైన్స్ మినహా ఇతర సబ్జెక్టు పేపర్లను ఒక్కొక్కటి చొప్పున 5 ఉంటాయి. ఇక సైన్స్ లో మాత్రం భౌతిక శాస్త్రం, వృక్ష శాస్త్రాలకు సంబంధించి వేర్వేరు పేపర్లుగా పరీక్షలు రాయాల్సి ఉంటుంది. 

పదో తరగతి పరీక్షలను గతంలో 80 మార్కులకు నిర్వహించేవారు. ఇంటర్నల్ మార్కులు 20 కలిపేవారు. అయితే ఈ సారి ఇంటర్నల్ పరీక్షల విషయంలో ప్రైవేట్ స్కూళ్లలో అక్రమాలు జరుగుతున్నాయన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ విధానాన్ని రెండేళ్ల కిందటే రద్దు చేసింది. 

అన్ని పేపర్లకు 100 మార్కుల చొప్పున కేటాయించారు. ఈసారి కూడా 100 మార్కులకే పరీక్షలు నిర్వహిస్తారు. ఇక సిలబస్ కవర్ చేసేందుకు వేసవి సెలవులు లేకుండా తరగతులు కొనసాగించాలని విద్యాశాఖ భావిస్తోంది. రెండో శనివారాలు, ఆదివారాలు మినహా మిగిలిన అన్ని రోజులను పని దినాలుగా చేయనున్నారు.   

Leave a Comment