కడప జిల్లాలో పేలుడు.. 9 మంది మృతి..!

కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్ల పల్లె శివారులో భారీ పేలుడు సంభవించింది. ముగ్గురాయి గనుల్లో జిలెటిన్ స్టిక్స్ పేలి 9 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురాయి గనుల్లో బ్లాస్టింగ్ కోసం వాహనంలో జిలెటిన్ స్టిక్స్ అన్ లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 

సీఎం జగన్ దిగ్భ్రాంతి..

ముగ్గురాయి గనుల్లో పేలుడు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడుకు సంబంధించిన కారణాలను సీఎం జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరణించిన వారి కుటుంబాలకు సీఎం జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Leave a Comment