DRDO 2-DG ఔషధానికి డీసీజీఐ గ్రీన్ సిగ్నల్..!

డిఫెన్స్ రీసెర్చ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్(DRDO) తయారు చేసిన 2-డియాక్సీ-డీ-గ్లూకోజ్(2-DG) ఔషధ అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. ఇది స్వల్ప నుంచి మోస్తరు కరోనాతో బాధపడుతున్న పేషెంట్లపై బాగా పనిచేయనుంది. 

కరోనా రోగులకు చికిత్స చేస్తూ అదనంగా ఈ ఔషధాన్ని ఇస్తే వారు వేగంగా కోలుకునే అవకాశం ఉందని డీఆర్డీవో ప్రకటించింది. ఇది జెనరిక్ మాలిక్యూల్, గ్లూకోజ్ అనలాగ్ కావడం వల్ల దీని ఉత్పత్తి చాలా సులువని, పెద్దమొత్తంలో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. 

ఈ ఔషధాన్ని వాడిన చాలా మందికి ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ లో నెగటివ్ గా తేలినట్లు డీఆర్డీవో చెప్పింద. ఇది వైరస్ ఉన్న కణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుందని తెలిపింది. దీనిని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ తో కలిసి డీఆర్డీవో ల్యాబ్ అయిన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైద్ సైన్సెస్ అభివృద్ధి చేసింది. ఇది కరోనా రోగులు చాలా వేగంగా కోలుకోవడానికి సహకరిస్తోందని క్లినికల్ ట్రయల్స్ లో తేలింది. 

Leave a Comment