‘బ్లాక్ పాంథర్’ హీరో కన్నుమూత..!

హాలీవుడ్ నటడు ‘బ్లాక్ పాంథర్’ హీరో చాడ్విక్ బోస్ మాన్(43) మరణించారు.  గత కొంతకాలంగా కోలన్(పెద్ద పేగు) క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన నేడు కన్నుమూశారు.. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా, చాడ్విక్ నాలుగేళ్లుగా క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. 2016 నుంచి చాడ్విక్ స్టేజ్ 3 పేగు క్యాన్సర్ తో బాధపడుతున్నాడు.  

చాడ్విక్ దక్షిణ కరోలినాలోని అండర్సన్ లో పుట్టి పెరిగాడు. 2013లో ‘42’ తో సినిమాల్లోకి వచ్చాుడ. 2016లో వచ్చిన ‘కెప్టెన్ అమెరికా సివిల్ వార్’ సినిమాలో మార్వెల్ సూపర్ హీరో బ్లాక్ పాంథర్ పాత్రను పోషించిన చాడ్విక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఇదే పాత్రను ‘ఎవెంజర్స్ ది ఎండ్ గేమ్’ లోనూ కొనసాగించాడు.  2018లో వచ్చిన బ్లాక్ పాంథర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.3 బిలియన్ల డాలర్లకు పైగా వసూలు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో నెట్ ప్లిక్స్ లో విడుదలైన డా 5 బ్లడ్స్ లో చాడ్విక్ చివరిసారిగా కనిపించాడు. చాడ్విక్ మరణంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 

ఇక ఆయన మృతి పట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. హాలీవుడ్, బాలీవుడ్ సహా అన్ని రకాల సినీ పరిశ్రమలకు చెందిన నటులు సంతాపం తెలిపారు. తొలి నల్లజాతి సూపర్ హీరోగా చాడ్విక్ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాడు. ఇటు యూఎస్ఏ అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో ఉన్న డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారీస్ కు ఆయన మద్దతు తెలిపాడు.

 

Leave a Comment