హ్యాపీ బర్త్ డే ‘కింగ్’ నాగ్..!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఈ రోజు 61వ వసంతంలోకి అడుగుపెట్టాడు. టాలీవుడ్ మన్మధుడు ఎవరంటే అది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. విభిన్నమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. 34 ఏళ్లుగా టాలీవుడ్ లో ఎన్నో మరుపురాని చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరలోనూ నాగార్జున సత్తా చాటుతున్నారు. మీలో ఎవరు కోటిశ్వరుడు, బిగ్ బాస్ వంటి షోలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి.  కింగ్ నాగార్జునకు పుట్టిన రోజు సందర్భంగా అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇక ఆయన బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న ‘వైల్డ్ డాగ్’ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ లో ఇప్పటి వరకు 12 మిషన్స్ చేసినట్లు ఉంది. ఎన్ఐఏ ఆఫీసర్ గా నాగ్ లుక్ ఆసక్తిని కలిగిస్తోంది. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున డేర్ డెవిల్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు అహిసార్ సాల్మన్ దర్శకత్వం విహిస్తుండగా, నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దియా మిర్జా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. 

Leave a Comment