ముంచుకొస్తున్న మరో ముప్పు..రష్యా, చైనాలో బ్లాక్ డెత్ ప్లేగు వ్యాధి..!

గతంలో ప్లేగు వ్యాధి ఎంతటి బీభత్సం సృష్టించిందో తెలిసిందే..అప్పట్లో ఈ వ్యాధితో కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. 14వ శతాబ్దంలో ప్లేగు వ్యాధి కారణంగా యూరప్ జనాభాలో 60 శాతం తుడిచిపెట్టుకుపోయింది. అంతటి భయంకరమైన ప్లేగు వ్యాధి ఇప్పుడు మరోసారి కలకలం రేపుతోంది. ఇటీవల రష్యా, యూఎస్, చైనా దేశాల్లో ఈ వ్యాధి మూలాలు మళ్లీ కనిపించాయి. ఈ ప్లేగు వ్యాప్తిని నియంత్రించడానికి యునిసెఫ్ ప్రపంచ దేశాలను పిలుపునిచ్చింది. 

బుబోనిక్ ప్లేగు అనేది బ్యాక్టీరియా నుంచి సంక్రమించే వ్యాధి. ఇది అడవి ఎలుకలపై వాలిన ఈగలు మనుషుల మీద వాలితే వెంటనే ఈ వ్యాధి సోకుతుంది. ఇది ఎంత ప్రమాదకరం అంటే కేవలం 24 గంటల్లోనే వ్యాధి సోకిన వ్యక్తి మరణిస్తాడు. అయితే ఈ బుబోనిక్ ప్లేగు ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి చాలా తక్కువగా సోకుతుంది. ఈగల నుంచి మాత్రమే ఇది మనుషులకు సోకుతుంది. కాంగో, మడగాస్కర్, పెరూ దేశాల్లో సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ మధ్యలో ఈ బుబోనిక్ ప్లేగు కేసులు నమోదవుతాయి. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు, గ్లోబల్ వార్మింగ్ కారణంగానే బుబోనిక్ ప్లేగు మళ్లీ వ్యాపించే అవకాశాలు ఉన్నాయని రష్యాలోని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ప్లేగు వ్యాధిలో చలి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, నరాల బలహీనత, వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి.   

 

Leave a Comment