2 తలలు, 3 చేతులతో కవల శిశువులు జననం..!

ఒడిశాలో ఓ తల్లి అవిభక్త కవలలకు జన్మనిచ్చింది. ఆ కవలలకు తలలు మాత్రం వేరుగా ఉండగా, శరీరాలు కలిసిపోయాయి. ఇద్దరు కవలలకు మూడు చేతులు, రెండు కాళ్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఘటన ఆదివారం ఒడిశా రాష్ట్రం కేంద్రపారా జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. రాజ్ నగర్ ప్రాంతంలోని కని గ్రామంలో నివసించే ఉమకాంత్ పరిదా, అతని భార్య అంబికాకు ఈ అరుదైన కవల శిశువులు జన్మించారు. 

అంబికా పురుటి నొప్పులతో బాధపడుతుండటంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అంబికా సీ సెక్షన్ ద్వారా బిడ్డలకు జన్మనిచ్చింది. పుట్టిన శిశువుల శరీరాలు అతుక్కుపోయి ఉన్నాయి. తలలు మాత్రం వేరుగా ఉండగా, ఇద్దరు కవలలకు మూడు చేతులు, రెండు కాళ్లు మాత్రమే ఉన్నాయి. అరుదైన సమస్యతో జన్మించిన ఈ నవజాత కవల శిశువులను వెంటనే కేంద్రపారాలోని జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. 

ఈ సందర్భంగా ఓ వైద్యురాలు మాట్లాడుతూ పిల్లల పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. రెండు తలలు ఉండటంతో చిన్నారులు ఇద్దరు వేర్వేరుగా తినడం, శ్వాసించడం చేస్తున్నారని పేర్కొన్నారు.  కాకపోతే వారు ఒకే శరీరం, మూడు చేతులు, రెండు కాళ్లను పంచుకున్నారన్నారు. ప్రత్యేక చికిత్స కోసం శిశువులిద్దరినీ కటక్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పీడియాట్రిక్స్ కు తరలించామని వైద్యురాలు తెలిపారు. 

 

Leave a Comment