ఖతర్ పాపకు సినిమా ఛాన్స్ వచ్చిందట..!

టిక్ టాక్ అప్పట్లో ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే.. టిక్ టాక్ వీడియోల ద్వారా కొందరు బాగా ఫేమస్ అయ్యారు..అలాంటి వారిలో ‘షాలిని బుజ్జి’ అదే మన ‘ఖతర్ పాప’ కూడా ఒకరు.. బండ బూతులను నీటుగా ప్రజెంట్ చేయడం, ఎవరైనా తనను కామెంట్ చేస్తే పచ్చి బూతులతో రెచ్చిపోవడం షాలిని బుజ్జి స్పెషాలిటీ.. అంతే కాదు మసాలా పాటలకు హాట్ డ్యాన్స్ కూడా చేసేది. ఇలా ఆమె వీడియోలో బాగా వైరల్ అయ్యాయి.. 

తాజాగా తనకు సినిమా ఛాన్స్ వచ్చిందటూ ప్రకటించింది ఈ ఖతర్ పాప.. అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేశానని, రెండు ఐటమ్ సాంగ్స్ ఇచ్చారని తెలిపింది. ఇక నుంచి తాను బూతులు మాట్లాడనని, ఎక్స్ పోజింగ్ వీడియోలు చేయనని చెప్పింది. తానేంటో అందరికీ చూపిస్తానని తెలిపింది. అంతే కాదు సినిమాలో తన డైలాగు కూడా ఒకటి చెప్పింది. అయితే ఏం సినిమా చేస్తుంది? డైరెక్టర్ ఎవరు? అనే వివరాలను వెల్లడించలేదు. ఇక ఆ సినిమా ఏదో.. అది ఎప్పుడొస్తుందో చూడాలి.. 

 

Leave a Comment