నీళ్ల కోసం 30 ఏళ్లుగా.. 3 కిలోమీటర్ల కాలువ తవ్వాడు..!

పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. 22 ఏళ్లపాటు ఒంటరిగా శ్రమించి తన గ్రామానికి రోడ్డు మార్గాన్ని సృష్టించిన మౌంటెన్ మ్యాన్ దశరథ్ మాంజీ గురించి అందరికీ తెలిసిందే..ప్రభుత్వం, అధికారుల వల్ల సాధ్యం కాని పనిని పట్టుదలతో 22 ఏళ్ల పాటు శ్రమించి 300 అడుగుల ఎత్తయిన కొండను నిట్టనిలువుగా చీల్చి పక్క గ్రామానికి మార్గాన్ని వేశాడు బీహార్ కు చెందిన దశరథ్ మాంజీ.. అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు..

తాజాగా బీహార్ లోని గయా ప్రాంతానికి చెందిన లాంగి భుయాన్ అనే వ్యక్తి కొండల నుంచి వచ్చే వర్షపు నీటిని గయాలోని లాహతువా ప్రాంతంలోని కోతిలావా పొలాలకు తీసుకెళ్లేందుకు మూడు కిలోమీటర్ల పొడవైన కాలువను తవ్వాడు. దీని కోసం 30 ఏళ్ల పాటు ఒంటరిగా శ్రమించాడు. చివరకు అనుకున్నట్లుగా ఆ నీటితో చెరువును నింపారు. ‘గత 30 ఏళ్లుగా నేను అడవికి నా పశువులను తోలుకెళ్తున్నాను. అక్కడే కాలువను తవ్వడానికి నిత్యం ప్రయత్నించాను. ఇందుకు గ్రామంలో ఏ ఒక్కరు కూడా సహాయం చేయలేదు. ప్రతి ఒక్కరు ఉపాధి కోసం పట్నం వెళ్తున్నారు. నేను మాత్రం మా ఊరిలోనే ఉంటాను’ అని లాంగి భయాన్ తెలిపారు.  ఆ పెద్దాయన చేసిన భగీరథ ప్రయత్నానికి నెటిజన్లు సలాం చేస్తున్నారు.  

Leave a Comment