‘అందరూ ఉన్నప్పుడే ప్రేమగా చూసుకోండి’ అంటూ ఎమోషనల్ పోస్ట్..!

బిగ్ బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ ఇంట్లో తీవ్ర విషాదం జరిగింది. గుండెపోటుతో  మెహబూబ్ తల్లి మరణించారు. జూలై 5న తన తల్లి చనిపోయినట్లు సోషల్ మీడియాలో మెహబూబ్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.  మెహబూబ్ తన అమ్మ గురించి రాసిన ఓ సుదీర్ఘ పోస్ట్ రాశారు. 

‘అమ్మ నన్ను ఒంటరిగా వదిలి వెళ్లిపోయావ్.. నేను ఇకపై నిర్ణయాలు ఎలా తీసుకోవాలి? నేను ప్రతి రోజూ ఎవరితో మాట్లాడాలి?..అమ్మా నువ్వు లేకపోతే నేను ఎలా బతకాలి?.. నువ్వు లేకుండా ఎలా బతకాలో అర్థం కావట్లేదమ్మా.. నువ్వు నాకు ఎప్పుడూ అండగా ఉన్నావు.. నా ఎదుగుదల చూసి మురిసిపోయావు.. మాకోసం అన్ని త్యాగం చేశావు.. నువ్వు లేకుండా మా జీవితాలు ఎటు వెళ్తాయో అర్థం కావట్లేదు.. ప్రతి క్షణం నిన్ను మిస్ అవుతూనూ ఉంటానమ్మా. జీవితం అంటే ఏంటో నేర్పించావు.. నువ్వు గర్వపడేలా చేస్తానమ్మా.. తమ్ముడు సుభాన్, డాడీలను జాగ్రత్తగా చూసుకుంటానని మాటిస్తున్నాను అమ్మా’.

‘జూలై 5 నాకు ఓ పీడకల.. నిమిషంలో అంతా జరిగిపోయింది. నీకు గుండెపోటు వచ్చింది. మమ్మల్ని వదిలి నువ్వు వెళ్లిపోయావ్.. మీరంతా మా అమ్మ గురించి ప్రార్థించండి. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అందుకే ఉన్నప్పుడే ప్రేమగా చూసుకోండి.. నిన్ను చాలా మిస్ అవుతాను అమ్మా’ అంటూ మెహబూబ్ భావోద్వేగానికి గురయ్యాడు.. 

 

Leave a Comment