కడుపులో పెద్ద స్టీల్ గ్లాస్.. సర్జరీ చేసి తొలగించిన డాక్టర్లు..!

ఓ పెషెంట్ కడుపులో ఓ పెద్ద స్టీల్ గ్లాస్ ని గుర్తించారు వైద్యులు.. సర్జరీ చేసి ఆ వ్యక్తి కడుపులో నుంచి దానిని తొలగించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.. వివరాల ప్రకారం.. మహారాజ్ గంజ్ జిల్లా గోత్వా భతౌలీ గ్రామానికి చెందిన సమర్ నాథ్ కొన్నాళ్లుగా హెర్నియాతో బాధపడుతున్నాడు. ఈ కారణంగా మలమూత్ర విసర్జనకు కూడా సరిగ్గా వెళ్లలేకపోతున్నాడు.  ఇటీవల అతడు కడుపునొప్పితో తీవ్రమైంది. దీంతో అతడిని జౌన్ పూర్ లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు.. 

ఆస్పత్రిలో వైద్యులు అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు.. ఎక్స్ రే తీసి చూడగా.. కడుపులో పెద్ద స్టీల్ గ్లాస్ ఉన్నట్లు గుర్తించారు. మొదట అతడి మలద్వారం ద్వారా గ్లాసును బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు.. దీంతో వైద్యులు అతడికి సర్జరీ చేసి కడుపు నుంచి స్టీల్ గ్లాస్ ని బయటకు తీశారు.. 

అయితే స్టీల్ గ్లాస్ కడుపులోకి ఎలా వెళ్లిందని వైద్యులు అతడిని ఆరా తీయగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు.. సమర్ నాథ్ చెప్పింది వైద్యులు నమ్మలేదు.. చివరికి అతడి మలద్వారం ద్వారానే స్టీల్ గ్లాస్ కడుపులోకి వెళ్లినట్లు వైద్యులు నిర్ధారించుకున్నారు. 

 

Leave a Comment