హ్యాపీ బర్త్ డే సీఎం జగన్..!

ప్రజా సంక్షేమ పథకాల అమలులో నూతన ఒరవడి సృష్టిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీ సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

‘ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. చిరకాలం మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ పీఎం మోడీ ట్వీట్ చేశారు. ఇక సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా లోక్ సభ స్పీకర్, నితిన్ గడ్కరీ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో సహా పలువురు పముఖులు శుభాకాంక్షలు తెలిపారు. 

కాగా, సీఎం జగన్ జన్మదినం సందర్భంగా సోమవారం జగనన్న శాశ్వత భూహక్కు-భూ రక్ష పథకం ద్వారా భూముల సమగ్ర రీసర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ క్రిష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. 

Leave a Comment