ఆరేళ్లు టార్చర్ పెట్టాడు.. అతన్ని క్షమించి వదిలేశా : నిత్యామీనన్

సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకు సైతం వేధింపులు తప్పడం లేదు.. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు తమకు జరిగిన వేధింపుల గురించి వెల్లడించారు..తాజాగా హీరోయిన్ నిత్యామీనన్ కూడా తనకు జరిగిన వేధింపుల గురించి ఓపెన్ అయ్యారు.. ఓ ఇంటర్వ్యలో తాను కూడా వేధింపులు ఎదుర్కొన్నానని వెల్లడించారు.. 

 ప్రస్తుతం ఈ మళయాల కుట్టి తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. విజయ్ సేతుపతితో కలిసి నటించిన మలయాళ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిత్యామీనన్ తన జీవితంలో జరిగిన ఓ ఘటన గురించి చెప్పారు. సంతోష్ వర్గీ అనే వ్యక్తి తనను ఆరేళ్లు ఇబ్బంది పెట్టినట్లు తెలిపారు. తనతో పెళ్లి జరుగుతున్నట్లు ప్రచారం చేశాడని పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని చాలా మంది చెప్పారని, అయితే తాను మాత్రం అతన్ని క్షమించి వదిలేశానని తెలిపారు.. తన గురించి సంతోష్ చెప్పేవన్నీ అసత్యాలను, వాటిని ఎవరూ నమ్మవద్దని కోరారు.  

Leave a Comment