హోర్డింగ్ ఎక్కి మైనర్ బాలిక హల్ చల్.. ప్రేమించిన వాడితో పెళ్లి చేయాలని డిమాండ్..!

మధ్యప్రదేశ్ ఇండోర్ లోని పరదేశిపురంలో ఆదివారం సాయంత్రం ఓ వింత ఘటన చోటుచేసుకుంది. తనకు నచ్చిన అబ్బాయితో పెళ్లి చేయాలని ఓ మైనర్ బాలిక హోర్డింగ్ ఎక్కి హల్ చల్ చేసింది. తన డిమాండ్ కు ఒప్పుకోకపోతే హోర్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. 

తన తల్లి తాను ప్రేమించి వ్యక్తితో పెళ్లికి అంగీకరించడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. ఇక సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను కిందికి దించేందుకు ప్రయత్నాలు చేశారు. ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయిని పిలిపించారు. చివరికి ఆ అబ్బాయి బుజ్జగించడంతో ఆ బాలిక కిందికి దిగినట్లు పర్దేశిపురం ఎస్సై అశోక్ పాటిదార్ తెలిపారు.  

 

Leave a Comment