కర్ణాటకలో మరో కొత్త వివాదం.. హిజాబ్ తర్వాత ఇప్పుడు బైబిల్..!

కర్ణాటక రాష్ట్రం రోజుకో కొత్త వివాదంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మొదట హిజాబ్.. తర్వత హలాల్ మాంసం.. తాజాగా బెంగళూరులోని ఓ స్కూల్ లో బైబిల్ వివాదం రాజుకుంది.. బెంగళూరులోని క్లారెన్స్ హైస్కూల్ యాజమాన్యం విద్యార్థులపై బైబిల్ ని బలవంతంగా రుద్దుతోందని హిందూ జన జాగరణ్ సమితి ఆరోపించింది.

విద్యార్థులందరూ నిత్యం బైబిల్ ని బ్యాగులో పెట్టుకుని తీసుకొచ్చే విధంగా స్కూల్ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసిందని పేర్కొంది. ఈ విషయాన్ని వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బైబిల్ వివాదంపై స్కూల్ యాజమాన్యం స్పందించింది. పాఠశాల తన వైఖరిని సమర్థించుకుంది. తాము బైబిల్ ఆధారిత విద్యను అందజేస్తామని పాఠశాల పేర్కొంది. 

తాము శాంతి కోసం పాటుపడే మనుషులమని, న్యాయపరంగానే పాఠశాలను నడుపుతున్నామని యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ విషయమై తమ న్యాయవాదులను సంప్రదించామని, వారి సూచనలను పాటించి సరైన నిర్ణయం తీసుకుంటామనా చెప్పింది. తాము న్యాయాన్ని ధిక్కరించమని పాఠశాల యాజమాన్యం తెలిపింది. 

 

Leave a Comment