బియ్యపు గింజలపై భగవద్గీత..!

హైదరాబాదీ అమ్మాయి అరుదైన ఘనతను సాధించింది. బియ్యపు గింజలపై భగవద్గీను రాసింది. దేశంలోనే తొలి మహిళా మైక్రో ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన హైదరాబాద్ కు చెందిన స్వారిక ఈ ఘనతను సాధించింది. గతంలోనూ  ఈమె బియ్యపు గింజలపై ఆకృతులు గీసి గుర్తింపు పొందింది. స్వారిక ఎల్ఎల్బీ చదువుతోంది. 

భగవద్గీతను 4,042 బియ్యపు గింజలపై రాసింది. మొత్తం 36,378 అక్షరాలతో కూడి 9,839 పదాలను రాసింది. ఇది పూర్తి చేయడానికి ఆమెకు 150 గంటల సమయం పట్టిందని స్వారిక చెప్పింది. బియ్యపు గింజల మీద ఆంగ్ల అక్షరమాల రాసినందుకు అత్యుత్తమ సూక్ష్మ కళాకారిణిగా ఆమె ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. గతేడాది నార్త్ ఢిల్లీ కల్చరల్ అసోసియేషన్ స్వారికకు ‘రాష్ట్రీయ పురస్కార్’ను కూడా అందజేసింది. ఆమె ఇప్పటి వరకు దాదాపు రెండు వేల దాకా మైక్రో ఆర్ట్స్ వేసినట్లు స్వారిక తెలిపింది.   

Leave a Comment