స్కూళ్ల ప్రారంభంపై సీఎం జగన్ కీలక ఆదేశాలు..!

ఆంధ్రప్రదేశ్ లో స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. నవంబంర్ 2 నుంచి పాఠశాలలను ప్రారంభిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం జరిగిన స్పందన కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ స్కూళ్లలో తరగతుల నిర్వహణ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలని సూచించారు.

  • 1, 3, 5, 7 తరగతులకు ఒక రోజు, 2,4, 6, 8 తరగతులు మరో రోజు నిర్వహిస్తారు.
  • ఒక వేళ విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే మూడు రోజులకు ఒకసారి తరగతులు నిర్వహిస్తారు. 
  •  అదే విధంగా స్కూళ్లు కేవలం మధ్యాహ్నం వరకు మాత్రమే పని చేస్తాయి. భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపిస్తారు.
  •  నవంబరు నెలలో ఇది అమలవుతుంది.
  •  డిసెంబరులో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.
  •  ఒక వేళ తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపకపోతే, వారి కోసం ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలి.

 

Leave a Comment