ఎంత ట్రై చేసినా నిద్ర రావడం లేదా.. ఇలా ప్రయత్నించండి..!

మనిషికి నిద్ర ఎంత ముఖ్యమో తెలిసిందే.. నిద్ర సరిగ్గా లేకపోతే దాని ఎఫెక్ట్ ఆరోగ్యంపై పడుతుంది. ఈరోజుల్లో చాలా మంది రాత్రిపూట నిద్రలేక ఇబ్బంది పడుతున్నారు. మనిషికి తగినంత నిద్ర లేకపోతే అనేక వ్యాధులు వస్తాయి. రోజంతా అలసటగా ఉంటుంది. రోజువారీ పనులు కూడా సరిగ్గా చేయలేం.. అందుకే కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే నిద్ర హాయిగా పడుతుంది.

నిద్ర పట్టేందుకు చిట్కాలు:

ప్రతి రోజు ధ్యానం చేయండి. ధ్యానం శరీరం మొత్తాన్ని రిలాక్స్ చేస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. నిద్ర హాయిగా పట్టడానికి సహాయపడుతుంది. అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
నిద్రలేమితో బాధపడే వారు ఆహారంలో మార్పులు చేసుకోవాలి. మెగ్నీషియం ఎక్కువగా ఉంటే ఆహారం తీసుకోవడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది. మనసు రిలాక్స్ గా ఉంటుంది. బచ్చలికూర, అరటిపండ్లు, చిక్ పీస్, బ్రోకలీ, కిడ్నీ బీన్స్, నట్స్, సీఫుడ్ లలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.
లావెండర్ నూనె నిద్రను ప్రోత్సహిస్తుంది. ఈ ఆయిల్ వాసన పీల్చుకోండి లేదా దిండుపై కొన్ని చుక్కలను వేసుకోండి. ఈ నూనె మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మంచి ప్రశాంతమైన నిద్ర పొందడంలో సహాయపడుతుంద. లావెండర్ టీని కూడా తయారు చేసి తాగవచ్చు.
ప్రతిరోజూ వ్యాయామం చేయండి. వ్యాయామంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. రోజువారీ వ్యాయామం చేయడం వల్ల నిద్రలేమి లక్షణాలను నియంత్రించవచ్చు.
నిద్రపోయే ముందు ఒక కప్పు గోరెవెచ్చని పాలలో పావు టీస్పూన్ దాల్చిన చెక్క పొడి లేదా టీ స్పూన్ జాజికాయ పొడి మిక్స్ చేసి తాగాలి.
ఒక కప్పు గోరువెచ్చనిి నీటిలో 2 టేబుల్ స్పూన్ల తేనే, యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి నిద్రకు ముందు తీసుకోవాలి. యాపిల్ సైడర్ వెనిగర్ లోని అమిన యాసిడ్ లు అలసట నుంచి ఉపశమనాాన్ని ఇస్తాయి. తెనేలోని రిలాక్సింగ్ గుణాలు మెదడులో సెరోటోనిన్ విడుదలను ప్రేరేపించేలా చేస్తాయి.

Leave a Comment