ఇండియా ఇంటెలిజెన్స్ వద్దన్న చైనా యాప్స్ కు ప్రత్యామ్నాయ యాప్స్ ఇవే..

ప్రస్తుతం దేశంలో చైనా యాప్స్ బ్యాండ్ చేయాలని డిమాండ్ బాగా పెరిగింది. మన దేశ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చైనాతో లింక్ ఉన్న యాప్ లను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇటీవల రిమూవ్ చైనా యాప్స్ పేరిట ఒక యాప్ ను కూడా డెవలప్ చేశారు. అయితే ఆ యాప్ ను గూగుల్ తొలగించింది. దేశంలో చాలా మంది చైనా యాప్స్ ను వాడటం తగ్గిస్తున్నారు కూడా…

ఈ తరుణంలో చాలా మంది కొన్ని చైనా యాప్స్ కు అడిక్ట్ అయి ఉన్నారు. కొంత మంది టిక్ టాక్ చూడందే నిద్ర పట్టదు. అయితే వాటికి ప్రత్యామ్నాయంగా మన ఇండిదన్స్ యాప్స్ చాలానే ఉన్నాయి. కానీ అవి అంతా పాపులర్ కాలేదు. మనం చైనా యాప్స్ ను నిషేధించాలంటే వాటిని వాడటం అలవాటు చేసుకోవాల్సిందే..ఇప్పుడు ఇండియన్ ఇంటెలిజెన్స్ వద్దన్న చైనా యాప్స్ కు ఇండియన్ యాప్స్ లో ఉన్న ఆల్టర్నేటివ్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

చైనా యాప్స్ కు ఆల్టర్నేటివ్ యాప్స్ ఇవే..

Best Alternatives of chinese mobile Apps

  1. టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయం – బోలో ఇండియా, రోపోసో 
  2. PUBG కి ప్రత్యామ్నాయం – కాల్ ఆఫ్ డ్యూటీ, గరేనా ఫ్రీ ఫైర్
  3. హలోకు ప్రత్యామ్నాయం – షేర్‌చాట్
  4. షేర్‌ఇట్‌, జెండర్ లకు ప్రత్యామ్నాయం – గూగుల్ ఫైల్స్ 
  5. యుసి బ్రౌజర్‌కు ప్రత్యామ్నాయం- గూగుల్ క్రోమ్
  6. కామ్‌స్కానర్‌కు ప్రత్యామ్నాయం – అడోబ్ స్కాన్, మైక్రోసాఫ్ట్ లెన్స్
  7. బ్యూటీప్లస్‌కు ప్రత్యామ్నాయం –  బి 612 బ్యూటీ అండ్ ఫిల్టర్ కెమెరా, కాండీ కెమెరా
  8. క్లబ్ ఫ్యాక్టరీ, షీన్ లకి ప్రత్యామ్నాయం –  ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా, కూవ్స్
  9. యాప్ లాక్‌కు ప్రత్యామ్నాయం – నార్టన్ యాప్ లాక్ 
  10. వివావీడియోకు ప్రత్యామ్నాయం – కైన్ మాస్టర్, అడోబ్ ప్రీమియర్ రష్
  11. లైవ్‌మీ, క్వాయ్ లకి ప్రత్యామ్నాయం – పెరిస్కోప్
  12. యుసి న్యూస్‌ కు ప్రత్యామ్నాయం – గూగుల్ న్యూస్
  13. ప్యారలల్ స్పేస్ కు ప్రత్యామ్నాయం – యాప్ క్లోనర్

 

Leave a Comment