దేశంలో మళ్లీ లాక్ డౌన్ ఉండదు..స్పష్టం చేసిన మోడీ..

కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారన్న పుకార్లను ప్రధాని మోడీ కొట్టిపారేశారు. ఇండియాలో మళ్లీ లాక్ డౌన్ ఉండదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన వివిధ రాష్ట్రాల సీఎంలతో మాట్లాడారు. అయితే కరోనాతో పోరాడుతూనే జాగ్రత్తలతో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించుకోవాలని సీఎంలకు సూచించారు. 

ప్రస్తుతం దేశంలో అన్ లాక్ 1.0 జరుగుతోందని, ఇప్పుడు అన్ లాక్ 2.0 గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కరోనా వల్ల ప్రజల్లో నెలకొన్న భయాన్ని పోగొట్టాలన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కేసులు అధికంగా పెరుగుతుండటం ఆందోళకరం అన్నారు. కరోనాపై పోరాటంతో ప్రజల భాగస్వామ్యం కీలకం అని తెలిపారు. 

ప్రజలకు టెలీమెడిసిన్ సేవలు అందించేందుకు సీనియర్ వైద్యుల బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సీఎంలకు సూచించారు. హెల్ప్ లైన్లను సమర్థవంతంగా అమలు చేయడానికి యువ వాలంటీర్ల బృందాన్ని నియమించుకోవాలన్నారు. ఆరోగ్య సేతు యాప్ ను పెద్ద సంఖ్యలో డౌన్ లోడ్ చేసిన రాష్ట్రాల్లో సానుకూల ఫలితాలు వస్తున్నాయని వెల్లడించారు.

 

Leave a Comment