చైనా వస్తువుల బ్యాన్ సాధ్యమేనా..?

లద్దాఖ్ లోని గాల్వన్ లోయ వద్ద సరిహద్దు వివాదంలో భారత్ – చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించిన విషయం తెలిసిందే.. దీంతో భారతదేశంలో చాలా మంది చైనాపై మండిపడ్డుతున్నారు. ఎలాగైనా చైనా తోకను కత్తిరించాలని, మన సత్తా ఎంటో చూపించాలని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. మరి కొంత మంది రోడ్ల మీదికి వచ్చి చైనా వస్తువులను తగలబెడుతున్నారు…దేశంలో ఎకంగా ‘బైకాట్ చైనా’ అనే ఉద్యమం నడుస్తోంది.

ఇక మన దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే చైనాతో లింక్ అయి ఉన్న యాప్ లను తొలగిచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. టిక్ టాక్, జూమ్, షేర్ ఇట్, జెండర్, యూసీ బ్రౌజర్ తదితర 52 అప్లికేషన్స్ ను వాడవద్దని సూచించాయి. ఈ యాప్స్ తో ప్రమదకరమని హెచ్చరించారు. ప్రస్తుతానికి కేంద్రం ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు..

మన దేశంలో చైనా వస్తువులను బ్యాన్ చేయాలని ఉద్యమం నడుస్తోంది. అయితే చైనా వస్తువులను బ్యాన్ చేయడం కేంద్ర ప్రభుత్వానికి సాధ్యమేనా? అంటే కాదని చెబుతున్నారు నిపుణులు..సెల్ ఫోన్లతో పాటు అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ దగ్గరి నుంచి అన్ని వస్తువులు చైనా నుంచి దిగుమతి చేసుకున్నవే..తక్కువ రేటుకు వస్తున్నాయని దేశంలో చైనా వస్తువులను కొని లక్షల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోంది. 

భారత్ లో 8 బిలియన్ డాలర్ల పెట్టుబడి…

ఇంకా మరి కొంత మంది వ్యాపారవేత్తల అభిప్రాయం ఏంటంటే…వస్తువులను ఎక్కడి నుంచి దిగుమతి చేసుకోవాలన్నది కంపెనీల అభిప్రాయమని, అయితే కంపెనీలు వస్తువులు ఎక్కడి నుంచి దిగుమతి చేసుకోవాలన్న దానిపై భారత ప్రభుత్వం ఎటువంటి చట్టం చేయలేదని చెబుతున్నారు..చైనీస్ కంపెనీలు భారతదేశంలో 8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు అంచనా.. అంతే కాక మనం మందులు తయారు చేసేందుకు వాడే కెమికల్స్ 70 శాతం చైనా నుంచి వస్తాయి. ఒక వేళ చైనా వస్తువులను బ్యాన్ చేస్తే..మన మందుల తయారీపై కూడా ప్రభావం పడుతుంది. ఎన్నో ప్రసిద్ధి చెందిన మన కంపెనీల్లో చైనా పెట్టుబడి పెట్టి ఉంది..ఏ కంపెనీలు ఎన్ని పెట్టుబడులు పెట్టాయో ఒకసారి కింది చార్ట్ చూడండి..

ఏ వస్తువులు దిగుమతి అవుతాయి…

చైనాతో మన సంబంధాలను కేవలం వాణిజ్య అంశాలపై మాత్రమే దృష్టి పెట్టాలని ది ఎకనామిక్ టైమ్స్ అభిప్రాయపడింది. చైనా నుంచి మన దిగుమతులను పరిశీలిస్తే..వాటిలో ఎక్కువ భాగం విద్యుత్ ప్లాంట్లు, టెలికాం పరికరాలు, మెట్రో రైలు కోచ్ లు, ఇనుము మరియు ఉక్కు ఉత్పత్తులు వంటి మూల ధన వస్తువులు ఉన్నాయి.

ఎరువులు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు మరియు ఎయిర్ కండిషనర్లు వంటి ఉత్పత్తులు చైనా నుంచి దిగుమతి అవుతాయి. ఎలక్ట్రానిక్స్ మరియు మొబైల్ ఫోన్లు, ఆటోలు, ఔషధాలు, రసాయనాలు మరియు ప్లాస్టిక్స్, ఇంజనీరింగ్ వస్తువులు..ఇలా అనేక రకాల వస్తువులు చైనా నుంచి దిగుమతి చేసుకుంటారు. 

బ్యాన్ చేస్తే ఏమవుతుంది..

ఒక వేళ మనం చైనా వస్తువులను బ్యాన్ చేస్తే..మనం ప్రాడక్ట్స్ ఎక్కడి నుంచి దిగుమతి చేసుకోవాలి? చైనా నుంచి అతి చైకగా వస్తువులను దిగుమతి చేసుకుంటాము..ఒక వేళ ఇతర దేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకుంటే వాటి విలువ చాలా పెరిగిపోతుంది. అప్పుడు మన కొనే వస్తుల రేటు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇంకా మన దేశంలో ఉత్పత్తి సామర్థ్యం చాలా తక్కువ ఉంది. దీంతో ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంది. 

Leave a Comment