‘ఆర్ఆర్ఆర్’ ఓ చెత్త సినిమా.. రాజమౌళిని జైల్లో పెట్టాలి’..!

ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం వచ్చేసింది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘RRR’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో మొదలైని ఈ సినిమా కరోనా లాంటి ఎన్నో అడ్డంకులను దాటుకుని ఎట్టకేలకు విడుదలైంది. అయితే ‘RRR’ సినిమాపై బాలీవుడ్ క్రిటిక్ కమ్ యాక్టర్ కమల్ ఆర్.ఖాన్ విమర్శలు చేశాడు. ‘RRR’ తల తోకాలేని సినిమా అంటూ కామెంట్స్ చేశాడు.. ఇంకా ఏమన్నాడంటే..

‘భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు తీయనటువంటి చెత్త సినిమా ‘RRR’. ఇది తలా తోకా లేని సౌత్ మసాలా సినిమా.. దీనిని పొరపాటు అని నేను చెప్పన. ఇది ఒక పెద్ద నేరం. రూ.600 కోట్లతో ఇలాంటి చెత్త సినిమా తీసినందుకు రాజౌళిని 6 నెలలు జైల్లో పెట్టాలి’.. అని కమల్ ఆర్.ఖాన్ వరుస ట్వీట్లు చేశాడు.. 

ట్విట్టర్ వేదికగా సౌత్ సినిమాపై తన అక్కసును వెళ్లగక్కాడు. ‘RRR’ సినమా అట్టర్ ఫ్లాప్ అని ఆమీర్ ఖాన్ నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’తో పోల్చాడు. అంతేకాదు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘ఆగ్’ సినిమాతో కంపేర్ చేశాడు. షోలే సినిమాకు రీమేక్ గా వచ్చిన ఆగ్ సినిమాపై కూడా విడుదలకు ముందు భారీ అంచనాలు ఉన్నాయని, విడుదలైన తర్వాత ఫ్లాప్ అని జనాలు తేల్చేశారని అన్నారు. అయితే కమల్ ఆర్.ఖాన్ సమీక్షలను చాలా మంది సీరియస్ గా తీసుకోరు. ఎందుకంటే గతంలో ఆయన బాహుబలి సినిమాను కూడా ఫ్లాప్ అన్నాడు..  

 

Leave a Comment