సంతాన సమస్యలకు సూపర్ ఫుడ్.. పరిశోధనలో వెల్లడి..!

పురుషులలో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంటే.. సంతానం కలగడం కష్టం అవుతుంది. వీర్య కణాల లెక్క ఒక మిల్లీ లీటర్ కి 15 మిలియన్లు ఉంటే.. మంచి ఆరోగ్యంగా ఉన్నట్లే. అంత కంటే తక్కువగా ఉంటే సమస్యలు తలెత్తవచ్చు.. వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉన్న పురుషులకు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఓ పరిశోధనలో వెల్లడైంది.. వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉన్న వారిలో శరీరంలో కొవ్వు, రక్తపోటు, చెడు కొలెస్టరాల్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం 20 శాతం ఎక్కువగా ఉందని గుర్తించారు. 

వీర్య కణాల సంఖ్య తక్కువ ఉన్న వారిని ఎంచుకొని ఇతరులతో పోల్చి చూస్తే కొన్ని కొత్త విషయాలు బయటపడ్డాయి. సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న 50 ఏళ్ల లోపు వారిలో మూడింట ఒక వంతు మందిలో టెస్టోస్టిరాన్ వంటి సెక్స్ హార్మోన్ల స్థాయిలు ఏడు రెట్లు తక్కువగా ఉంటున్నట్లు వెల్లడైంది. దీని వల్ల కండరాల బరువు, ఎముకల సాంద్రత తగ్గి, ఎముకలు సులభంగా విరిగేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. సంతాన చికిత్సలు తీసుకునే మగవారు సెక్స్ హార్మోన్ల పరీక్షలు చేయించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

లైంగికవాంఛ కోసం మెంతులు 

మెంతులు అనేవి భారతీయ ఆహార విధానంలో ఒక సాధారణ పదార్ధంగా చెప్పవచ్చు. ఇది ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇటీవలి అధ్యయనం ప్రకారం మగవారు మెంతులను తీసుకుంటే శృంగారంపై ఆసక్తి పెరుగుతున్నట్లు తేలింది. కొందరిని ఎంచుకొని మెంతుల సారాన్ని ఆరు వారాల పాటు అందించారు. దీంతో 82 శాతం మందిలో శృంగారంపై ఆసక్తి గణనీయంగా పెరిగినట్లు తేలింది. అంతేకాదు 63 శాతం మందిలో శృంగార సామర్థ్యమూ మెరుగుపడిందని గుర్తించారు.  మెంతులలో ఉండే ‘సెపోని న్స్’ దానికి కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే అవి లైంగిక హార్మోన్ల ఉత్పత్తిని, ముఖ్యంగా టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి.

 

Leave a Comment