యాంకర్ అనుసూయ ఇంట్లో తీవ్ర విషాదం..!

జబర్దస్త్ యాంకర్, ప్రముఖ నటి అనసూయ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి సుదర్శన్ రావు(63) అనారోగ్యంతో మరణించారు. తార్నాకలోని తన సొంత ఇంట్లో ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తర్వాత కొద్ది నిమిషాల్లోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.. దీంతో అనుసూయ కుటుంబం, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

కాగా సుదర్శన రావు గతంలో యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేశారు. అలాగే సోషల్ యాక్టివిటీస్ లో ఆయన పేరు ప్రముఖంగా వినపడేది. సుదర్శన రావు కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు తెలిసింది. సుదర్శన రావు మృతితో అనసూయ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. వెండితెర, బుల్లితెరకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.    

 

Leave a Comment