ఉదయాన్నే పరగడుపున బెల్లం కలిపిన గోరు వెచ్చని నీరు తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎముకల ధ్రుడత్వం నుంచి జీర్ణక్రియ వరకు అనేక లాభాలు కలుగుతాయి. గోరువెచ్చని నీటిలో వెల్లం వేసుకొని తాాగడం వల్ల కలిగే లాభాలు ఏవో చూద్దాం..
బెల్లం నీరు తాగితే కలిగి బెన్ ఫిట్స్
- ఓ గ్లాస్ నీటిిని గిన్నెలో వేసుకొని వేడి చేసుకోండి. అందులో కొద్దిగా బెల్లం వేయండి.. అది కరిగాక బెల్లం నీటిని తాగండి..
- బెల్లం కలిపిన నీటిని తాగడం వల్ల ఎముకల ద్రుఢత్వం మెరుగవుతుంది. కీళ్ల నొప్పులు కూడా తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది.
- శరీరంలో వ్యర్థాలు సులువుగా బయటికి వెళ్లేందుకు బెల్లం సహకరిస్తుంది. రక్తం శుభ్రంగా ఉండేందుకు కూడా సహాయపడుతుంది.
- బెల్లంలో ఐరన్, ఫోలెట్ పుష్కలంగా ఉంటాయి. అందుకే శరీరానికి ఐరన్ అందాలంటే బెల్లం నీటిని తాగడం మంచి ఆప్షన్.
- బెల్లంలో మెగ్నిషియమ్, విటమిన్ బీ1, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. అందుకే ఉదయాన్నే బెల్లం నీరు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది.
- బెల్లం నీరు జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది. మలబద్ధకం లాంటి సమస్య తగ్గేందుకు తోడ్పడుతుంది.