కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మార్చి 22న ఆదివారం కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూను అమలు చేసింది. అయితే కరోనా లక్షణాలు ఉన్న వారు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని ప్రభుత్వం దాదాపు రెండు వారాల నుంచి చెబుతూ వస్తోంది. అయితే కొంత మంది మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. తమకు బోర్ కొడుతుందని అంటున్నారు.
మరి కొందరు మాత్రం మన ఆరోగ్యం కోసం ఇంట్లోనే ఉండక తప్పదు అని స్పందించారు. సెలబ్రిటీలు మాత్రం కొన్నిరోజులుగా షూటింగ్స్ కు ప్యాకప్ చెప్పేసి ఇంటి వద్ద పిల్లలతో, కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఓ ఆర్మీ మాజీ ఉద్యోగిని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గ్రీష్మ అనే మహిళ సొంతంగా క్వారంటైన్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఆ సమయాన్ని బెల్లీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది. దానిని వీడియో తీసి పోస్ట్ చేసింది. ఇంకేముంది ఆ వీడియో కాస్త వైరల్ అయింది. ప్రొఫెషనల్ డ్యాన్సర్ గా ఆమె నడుము తిప్పుతు చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.