అయోధ్య రామ మందిరం కోసం రూ.90 లక్షలు విరాళమిచ్చిన ముస్లిం..!

అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి ఓ ముస్లిం వ్యక్తి భారీ విరాళం ప్రకటించాడు. యూపీలోని ముజఫర్ నగర్ జిల్లా ఖలాపూర్ పట్టణానికి చెందిన డాక్టర్ మహమ్మద్ సమర్ ఘజ్నీ తన కుటుంబానికి చెందిన రూ.90 లక్షల విలువైన ఆస్తిని అయోధ్య మందిర నిర్మాణం కోసం విరాళంగా అందించారు. ఈ ఆస్తి అమ్మకం ద్వారా వచ్చిన సొమ్మును ఆలయ నిర్మాణానికి ఉపయోగించాలని కోరారు. 

దేశంలోని ముస్లిం సమాజం కూడా అయోధ్య, కాషాయాన్ని ప్రేమిస్తుందనే సందేశాన్ని పంపడమే తన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఇటీవల రంజాన్ పండుగ సందర్భంగా కాషాయ దుస్తులతో సమర్ ఘజ్నీ ప్రార్థనలు చేశారు. 2024లో పెద్ద సంఖ్యలో ముస్లింలు యోగి ఆదిత్యనాథ్ కు మద్దతుగా నిలుస్తారని సమర్ ఘజ్నీ తెలిపారు. యోగీ ఓ మతానికి వ్యతిరేకం కాదని, కేవలం నేరస్థులు, మాఫీయాకు మాత్రమే వ్యతిరేకమని ఆయన అన్నారు. 

 

 

Leave a Comment