లాక్ డౌన్ లో ఆఫర్లు ప్రకటించిన బ్యాంకులు

లాక్ డౌన్ సమయంలో బ్యాంకులు తమ కస్టమర్లకు ఆఫర్లు ప్రకటిస్తున్నయి. ఈ కష్టకాలంలో తమ వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. తమ కార్డులతో ఔషధాలను కొనుగోలు చేస్తే 15 శాతం డిస్కౌంట్ ఇస్తామని చెప్పింది. అపోలో ఫార్మసీ స్టోర్ లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డులతో కొనుగోలు చేస్తే 15 శాతం దాకా డిస్కౌంట్ పొందవచ్చని ట్విట్ చేసింది. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన వినియోగదారులను ఆకట్టుకునే ఆఫర్ ప్రకటించింది. యోనో ఎస్బీఐ యాప్ ద్వారా అపోలో హెల్త్ చెకప్ చేయించుకోవడం ద్వారా కొన్ని ల్యాబ్ టెస్టులపై డిస్కౌంట్లు ఇస్తామని పేర్కొంది. హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ కూడా అక్షయ తృతియా రోజున తమ క్రెడిక్ కార్డులతో రూ.10 వేలు పైబడి కొనుగోలు చేస్తే 5 రెట్లు రివార్డ్ పాయింట్లు ఇస్తామని, పీఎం కేర్స్ ఫండ్ కు రూ.100 విరాళంగా ఇస్తామని చెప్పింది. ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లు ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా చేసుంటే జూన్ 30 దాకా ఎటువంటి ఛార్జీలు విధించబోమంటూ చెప్పింది. 

Leave a Comment