ఏపీలో కొత్తగా 33 కరోనా కేసులు..దేశంలో 70వేలు దాటిన కేసులు

రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2051కు చేరింది. ఇప్పటి వరకు 46 మంది మరణించారు. 1056 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు 949 మంది ఉన్నారు. 

ఈరోజు వచ్చిన కేసులు చిత్తూరు లో 10, నెల్లూరులో 9, తూర్పుగోదావరిలో 1 కేసు మొత్తం 20 కేసులు కోయంబేడు నుంచి వచ్చినవిగా నిర్ధారించారు. కర్నూలులో 9, క్రిష్ణాలో 4 కేసులు వచ్చాయి. గత 24 గంటల్లో 10,730 శాంపిల్స్ పరీక్షించగా 33 మంది కోవిడ్-19 సాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. 

జిల్లాల వారీగా కేసుల వివరాలు..

 

జిల్లా పేరుకరోనా కేసుల సంఖ్య
కర్నూలు584
గుంటూరు387
క్రిష్ణా346
చిత్తూరు131
అనంతపురం115
నెల్లూరు111
కడప97
పశ్చిమ గోదావరి68
విశాఖపట్నం66
ప్రకాశం63
తూర్పు గోదావరి47
శ్రీకాకుళం5
విజయనగరం4
ఇతరులు27
మొత్తం2051

 

దేశంలో 70వేలు దాటిన కేసులు

ఇక దేశంలో 70,756 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు 2293 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 46,006 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 3604 కేసులు వచ్చాయి. 

రాష్ట్రాల వారీగా కేసుల వివరాలు

  •  మహారాష్ట్ర – 23,401
  • గుజరాత్ – 8,542
  •  తమిళనాడు – 8,002
  • ఢిల్లీ – 7,233
  • రాజస్థాన్ – 3,988
  • ఉత్తరప్రదేశ్ -3,573
  • పశ్చిమ బెంగాల్ – 2,063
  • పంజాబ్ – 1,877
  • తెలంగాణ – 1,275
  • జమ్మూకశ్మీర్ – 879
  • కర్ణాకట – 862
  • హర్యానా – 730

 

Leave a Comment