లాక్ డౌన్ పొడిగింపునకే మోడీ మొగ్గు…

లాక్ డౌన్ ను క్రమక్రమంగా సడలించాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పీఎం మోడీ సూచించినట్లు తెలిసింది. దేశంలో ఈ మహమ్మారి వ్యాప్తి లాక్ డౌన్ సడలింపు ప్రజా రవాణా ఆర్థిక పరిస్థితుల వంటి అంశాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడటం ఇది ఐదోసారి. 

మహమ్మారికి అడ్డుకట్టవేయడానికి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నప్పటికీ కూడా ఇది కట్టడిలోకి రాకపోవడంతో ..ఈ వైరస్ కట్టడిలోకి వచ్చే వరకు రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా పనిచేసి ఈ మహమ్మారిని ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ మన ముందు ప్రస్తుతం కరోనా అనే ఛాలెంజ్ ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 దేశంలోని గ్రామాలకు ఈ వైరస్ వ్యాపించకుండా చేయడమే తక్షణ కర్తవ్యం అని చెప్పారు. పలు రాష్ట్రాలు కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలను మోదీ అభినందించారు. కరోనాకు వ్యతిరేకంగా పోరాడటంలో యావత్ ప్రపంచం నేడు మమ్మల్ని ప్రశంసిస్తోందన్నారు. 

రాష్ట్రాలు తమ బాధ్యలేమిటో గుర్తించి అందుకు అనుగుణంగా వ్యవహరించాయని అన్నారు. ఇప్పుడు క్రమంగా లాక్ డౌన్ ను ఎత్తివేయడంలో భాగంగా సడలింపులపై దృష్టి పెట్టాలని మోడీ చెప్పినట్లు సమాచారం. దీంతో ప్రధాని మోదీ మరోసారి లాక్ డౌన్ ను పొడించటానికే మొగ్గు చూపారని తెలుస్తోంది. అయితే కేంద్రం మూడో విడత లాక్ డౌన్ అనంతరం ప్రజా రవాణాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని తెలుస్తోంది. దేశీయ విమాన ప్రయాణాలకు కేంద్రం అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

Leave a Comment