కస్టమర్ ఖాతాలో రూ.182 కోట్లు వేసిన బ్యాంక్..షాకైన కస్టమర్..!

అమెరికాలో ప్రసిద్ధి చెందిన సిటీ గ్రూప్ పొరపాటున 900 మిలియన్ల డాలర్లను కస్టమర్ల అకౌంట్లలోకి తరలించిన ఉదంతం అందిరినీ షాక్ కు గురిచేసింది. ఇది మరవకముందే మరో దిగ్గజ బ్యాంకులో ఇలాంటి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మసాచుసెట్స్ లోని బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్ కస్టమర్ ఖాతాలో ఇంకా ఎక్కువ అమౌంట్ దర్శనమచ్చింది. అయితే ఈ విషయాన్ని బ్యాంక్ గమనించలేదు.. దీంతో సదరు కస్టమర్ స్వయంగా బ్యాంకు సంప్రదించడంతో సమస్య పరిష్కారమైంది. 

బ్యాంక్ ఆఫ్ అమెరికా వినియోగదారుడు సైకియాట్రిస్ట్ బ్లేజ్ అగ్యురే ఖాతాలోకి 2.45 బిలియన్ డాలర్లు(సుమారు రూ.182 కోట్లు) పడ్డాయి. దీంతో ఆ కస్టమర్ ఖంగుతిన్నాడు. మొదట తన మొబైల్, వెబ్ లో పరిశీలించాడు. తన ఖాతాలో సొమ్మును ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకున్నాడు. బ్యాంకు కూడా దీనిని గుర్తించకపోవడంతో చివరికి బ్యాంకు రిలేషన్ షిప్ మేనేజర్ ను సంప్రదించి సమస్యను చెప్పి సమస్యను పరిష్కరించుకున్నాడు. అయితే ఇది కేవలం డిస్ ప్లే సమస్య తప్ప మరేమీ కాదని బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రతినిధి బిల్ హాల్డిన్ వెల్లడించారు. 

Leave a Comment