కరోనా రోగుల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు : సీఎం జగన్

ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పేర్కొన్న ఫీజుల కంటే కరోనా రోగుల వద్ద నుంచి ఎక్కువ వసూలు చేస్తే కచ్చితంగా చర్యలు ఉంటాయని సీఎం జగన్ హెచ్చరించారు. స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్ చికిత్సలకు అధిక రేట్లు వసూలు చేయడం పట్ల సీఎం జగన్ సీరియస్ అయ్యారు. కోవిడ్ ఆస్పత్రులు నిర్వహణపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని సూచించారు. కోవిడ్ రోగులకు అరగంటలో బెడ్ కేటాయించాలన్నారు. 

104, 14410 కాల్ సెంటర్లకు వచ్చే ఫోన్ కాల్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.  కోవిడ్ ఆస్పత్రిల  సేవలు నాణ్యంగా ఉండాలన్నారు. అన్ని కోవిడ్ ఆస్పత్రిల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాల ద్వారా కోవిడ్ ఆస్పత్రులను మానిటరింగ్ చేయాలని సూచించారు. ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్పత్రుల్లో భద్రతా ప్రమాణాలు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాల నిరోధించే పరికరాలు ఉండేలా చూడాలన్నారు. 

 

Leave a Comment