‘పవన్ ని చూసి నేర్చకోండి’.. యువ హీరోలకు బండ్ల గణేష్ కౌంటర్..!

ప్రొడ్యుసర్, నటుడు బండ్ల గణేష్ కు పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో తెలిసిందే.. సోషల్ మీడియాలో ఆయన గురించి పొగుడ్తూ పోస్టులు పెడుతుంటాడు.. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ నెటిజన్లకు ఆగ్రహాన్ని కలిగిస్తోంది. దీంతో ఆయన్ను బాగా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాకు సంబధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు యువ హీరోలు నాగ చైతన్య, అడివి శేష్, సిద్ధూ జొన్నలగడ్డ అతిథులుగా హాజరయ్యారు.. ఈవెంట్ లో సినీ పెద్దలు ఎవరూ రాలేదు..దీంతో ఆ యువ హీరోలు చాలా కంఫర్ట్ గా సీట్లలో కాళ్లు పైకి పెట్టుకొని కూర్చున్నారు..   

దీంతో బండ్ల గణేష్ ఆ యువ హీరోలు కూర్చున్న ఫొటోను, పవన్ కళ్యాణ్ ఓ ఆడియో ఫంక్షన్ లో పద్ధతిగా కూర్చున్న ఫొటోను షేర్ చేశారు. ‘నమస్కారానికి నిలువెత్తు నిదర్శనం మా దేవర. దయచేసి నేర్చుకోండి. ఆచరించండి. అది మన ధర్మం’ అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది. దీనిపై బండ్లన్నను నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. వాళ్లేదో సరదాగా కూర్చున్నారు. అక్కడ ఎవరికీ లేని బాధ నీకెందుకు అంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ హీరోను పొగడాలని ఇతర హీరోలను తిట్టాల్సిన అవసరం ఏముంది అంటే కామెంట్లు చేస్తున్నారు. 

Leave a Comment