పెళ్లయి ఒక్కరోజైనా గడవలేదు.. శోభనం గదిలో వరుడు మృతి..!

పెళ్లయి పూర్తిగా ఒకరోజు కూడా గడవలేదు. కాళ్లకు పెట్టిన పారాణి ఆరలేదు. అప్పుడే పెళ్లింట విషాదం నెలకొంది. వందేళ్లు జీవితాన్ని ఊహించుకున్న ఆ నవ వధులు కలలు కళ్లలయ్యాయి. శోభనం గదిలోనే వరుడు మృతి చెందాడు ఈ విషాద ఘటన ఏపీలోని అన్నమయ్య జిల్లాలో వెలుగుచూసింది..

వివరాల్లోకి వెళ్తే.. పాకాల మండలం కట్టికందపల్లెకు చెందిన తులసీ ప్రసాద్, మదనపల్లె జిల్లా చంద్రాకాలనీకి చెందిన యువతి ప్రేమించుకున్నారు. ఇద్దరు తమ ప్రేమ విషయాన్ని ఇళ్లల్లో చెప్పగా.. పెద్దలు వారి ప్రేమను అంగీకరించి పెళ్లి చేశారు. సెప్టెంబర్ 12న పెద్దల సమక్షంలో తులసి ప్రసాద్ యువతికి తాళి కట్టాడు. 

వివాహం తర్వాత జరిగే కార్యం నిమిత్తం తులసి ప్రసాద్ తన భార్యతో కలిసి అత్తగారింటికి వెళ్లాడు. అదే రోజూ రాత్రి శోభనం ముహూర్తం ఉండటంతో ఏర్పాట్లు చేశారు. శోభనం గదిలోకి ముందుగా తులసి ప్రసాద్ ను పంపించారు. కొద్దిసేపటి తర్వాత వధువును లోపలికి పంపారు. కానీ ఎన్నో ఆశలతో శోభనం గదిలోకి అడుగుపెట్టిన ఆ వధువుకు షాకింగ్ దృశ్యం కనిపించింది. 

తులసి ప్రసాద్ బెడ్ పై నిర్జీవంగా పడి ఉన్నాడు. ఇది చూసి కంగారుపడిన యువతి పెద్దలకు విషయాన్ని చెప్పింది. వారు వెంటనే తులసీ ప్రసాద్ ను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతడ్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. పెళ్లయిన 24 గంటల్లోనే వరుడు మరణించడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. అయవతే తులసీ ప్రసాద్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.    

 

Leave a Comment