టాలీవుడ్ పెద్దల భేటీపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో టాలీవుడ్ పెద్దల భేటీపై హీరో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పెద్దలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చలు తనకు తెలియదని బాలకృష్ణ చెప్పారు. సినిమా షూటింగులు ప్రారంభించే విషయంపై ప్రభుత్వంతో చర్చల విషయం పత్రికల్లో వచ్చిన వార్తలు చుశానని తెలిపారు. జూన్‌లో షూటింగులు ప్రారంభమవుతాయని అనుకుంటున్నట్లు బాలకృష్ణ అభిప్రాయపడ్డారు.

 షూటింగ్‌ల కోసం ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వాలని కోరారు. ఎక్కువ శాతం షూటింగ్‌లు ప్రారంభమైన చిత్రాలకు త్వరగా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. షూటింగ్‌ సమయంలో సామాజిక దూరం పాటించాలని బాలయ్య స్పష్టం చేశారు. ప్రస్తుతం బాలయ్య చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలలో హల్ చల్ చేస్తున్నాయి. 

 

Leave a Comment