వియత్నాంలో 9వ శతాబ్ధపు శివలింగం

వియత్నాంలోని చామ్ టెంపుల్ కాంప్లెక్స్ లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జరుపుతున్న పునరుద్ధరణ పనుల్లో 9వ శతాబ్ధపు పురాతన శివలింగం బయటపడింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వియత్నాంలో 9వ శతాబ్దానికి చెందిన ఇసుక రాతితో చేసిన ఏకశిలా శివలింగం బయటపడిందని, మైసన్ లోని చామ్ టెంపుల్ కాంప్లెక్స్ లో పని చేస్తున్న ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీక్ అభినందనలు అని ట్విట్ చేశారు. 2011లో తాను అక్కడ పర్యటన చేశానని, ఆ జ్ఞాపకాలు తనకు గుర్తొస్తున్నాయని వెల్లడించారు. 

ఈ చామ్ టెంపుల్ అనేది వియత్నాంలోని క్వాంగ్ నామ్ పరిధిలో ఉన్న మైసన్ సిటీలో ఉంది. దీన్ని యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది. కింగ్ ఇంద్రవర్మన్ 2 కాలంలో ఈ దేశాలయాన్ని నిర్మించారు. ఆయన బౌద్ధమతాన్ని బాగా ప్రచారం చేశారు. అయితే బౌద్ధ మతంతో పాటు హిందూ మతం కూడా అప్పట్లో ఉన్నట్లు ఈ శివలింగం ద్వారా తెలుస్తోంది. ఈ దేవాలయంలో ఇంతకుముందు కూడా ఆరు శివలింగాలను గుర్తించారు. అయితే వాటన్నింటికంటే ఇది చాలా అద్భుతమైందనిగా సర్వే అధికారులు తెలిపారు. 

Leave a Comment