30 నిమిషాల్లో ప్లేట్ ఖాళీ చేస్తే రూ.లక్ష బహుమతి.. విజయవాడ హోటల్ లో ఆఫర్..!

‘బాహుబలి థాలీ’.. ఏంటీ కొత్త సినిమా అనుకుంటున్నారా.. కాదండోయ్.. ఓ హోటల్ వారు భోజనానికి పెట్టిన పేరు..దీనికి బహుమతి కూడా పెట్టారు. నోరూరించే 30 వంటకాలతో ఈ ‘బాహుబలి థాలీ’ ఉంటుంది. దీనిని 30 నిమిషాల్లో తింటే రూ.లక్ష సొంతం చేసుకోవచ్చు.. ఇదేదో బాగుంది కదూ.. దీని సంగతేంటో తెలుసుకుందాం.. 

ఈ ఆఫర్ ప్రకటించింది విజయవాడలోని ‘నాయుడు గారి కుండ బిర్యానీ’ రెస్టారెంట్.. బాహుబలి థాలీ పేరుతో కంచంలో బిర్యానీ సహా 30 రకాల వంటకాలు వడ్డిస్తారు. వాటన్నింటినీ 30 నిమిషాల్లో శుభ్రంగా తినేస్తే లక్ష రూపాయలు సొంతం చేసుకోవచ్చు. విజయవాడలో ఆహార ప్రియులను ఆకర్షించేందుకు ఇతర ప్రాంతాల్లో బాగా ప్రచారంలో ఉన్న ట్రెండ్ ని ఫాలో అవుతోంది ఈ రెస్టారెంట్.. 

ఈ విషయాన్ని ఆన్ లైన్ లో చూసిన జనం నాయుడు గారి కుండ బిర్యానీ రెస్టారెంట్ కి క్యూ కట్టేస్తున్నారు. యూట్యూబ్ లో వీడియోలు చూసి ఇదేదో బాగుంది ట్రై చేద్దామని చాలా మంది వస్తున్నారు. ఇక ఈ పోటీలో రోజుకు 40 మంది పాల్గొంటున్నట్లు రెస్టారెంట్ యజమాని చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం విజయవాడకు చెందిన ఓ యువకుడు బాహుబలి థాలీని 30 నిమిషాల్లో పూర్తి చేసి లక్ష గెలుచుకున్నట్లు చెప్పారు. 

Leave a Comment