మనిషి ముఖంతో వింత మేక జననం..దేవుడంటూ పూజలు చేసిన జనం..!

గుజరాత్ రాష్ట్రంలో వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మేక మనిషి ముఖంతో ఉన్న ఓ వింత జీవికి జన్మనిచ్చింది. దీంతో ఆ వింత జీవిని చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఆ వింత జీవికి పూజలు నిర్వహించారు. అయితే ఆ వింత జీవి కేవలం కొద్ది నిమిషాలు మాత్రముే బతికి ఉండటం గమనార్హం..

రాష్ట్రంలోని సోనాఘడ్ తాలుకా సెల్టిపేట గ్రామానికి చెందిన అజయ్ భాయ్ వాసవ అనే రైతు మేకలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అతడి ఇంట్లో ఓ మేక ప్రసవించింది. అయితే ఆ మేక వింత జీవికి జన్మనివ్వడంతో అది హాట్ టాపిక్ గా మారింది. విషయం తెలిసి ఆ వింత జీవిని చూసేందుకు ప్రజలు క్యూ కట్టారు. 

మనిషి ముఖాన్ని పోలి ఉండటంతో ఆ వింత జీవిని దేవుడి ప్రతి రూపం అంటూ గ్రామస్తులు పూజలు చేశారు. సాధారణంగా మేలకు తోక ఉంటుంది. కాని ఈ వింత జీవికి మాత్రం తోక లేదు. మనిషికి ఉన్నట్టుగానే ముఖం, ముక్కు, నోరు, నుదురు ఉన్నాయి. నాలుగు కాళ్లు కూడా ఉన్నాయి. అయితే ఈ వింత జీవి కేవలం పది నిమిషాలు మాత్రమే బతికింది. స్థానికులు ఈ వింత జీవికి భక్తి శ్రద్ధలతో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోొ, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Leave a Comment