‘జీతాలు తీసుకునేవారు చనిపోతే అమరవీరులా?’.. జవాన్లను అవమానిస్తూ రచయిత్రి పోస్ట్..!

దేశ రక్షణలో భాగమైన సైనికులను అవమానిస్తూ అసోంకు చెందిన రచయిత్రి శిఖా శర్మ వివాదస్పద పోస్ట్ చేసింది. దీంతో ఆ రచయిత్రిని పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల దాడిలో 23 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అసోం రచయిత్రి శిఖా శర్మ ఫేస్ బుక్ లో వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. 

‘జీతాలు తీసుకుని పనిచేసే ఉద్యోగులు మరణిస్తే అమరవీరులుగా గుర్తించవద్దు.. ఆ విధంగా భావించాలనుకుంటే విద్యుత్ ఉద్యోగులు కూడా ప్రమాదాల్లో మరణిస్తారు. వారిని కూడా అమరవీరులుగా ప్రకటించవచ్చు కదా? మీడియా ప్రజలను భావోద్వేగాలకు గురి చేయవద్దు’ అని ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. దీంతో పలువురు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. 

Leave a Comment