కోబ్రా కమాండోను విడుదల చేసిన మావోలు..!

మావోయిస్టులకు బందీగా చిక్కిన కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ ను క్షేమంగా విడిచిపెట్టారు. చత్తీస్ గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న తెర్రమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం ఈ జవాన్ ను మావోలు వదిలిపెట్టారు. ఆ తర్వాత ఆయనను బీజాపూర్ లోని సీఆర్పీఎప్ క్యాంపుకు తరలించారు. 

ఐదు రోజుల క్రితం జరిగిన ఎదురుకాల్పుల్లో 23 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.. ఈ ఎదురు కాల్పుల తర్వాత రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు బందీగా పట్టుకున్నారు. తమ చెరలో ఉన్న జవాన్ క్షేమంగా ఉన్నాడని చర్చలకు ప్రతినిధి బృందాన్ని పంపిస్తే విడుదల చేస్తామని మవోలు అధికారిక ప్రకటన చేశారు. రాకేశ్వర్ క్షేమంగా ఉన్నడని రెండు రోజుల క్రితం మావోయిస్టులు ఓ ఫొటోను విడుదల చేశారు. 

రాకేశ్వర్ సింగ్ విడిపించేందుకు 11 మంది సభ్యులు గల మధ్యవర్తిత్వ బృందం మావోయిస్టు నేతలతో చర్చలు జరిపింది. దీంతో తెర్రమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గ్రామస్తులతో సభ నిర్వహించి రాకేశ్వర్ ను మావోలు మధ్యవర్తులకు అప్పగించారు. 

 

Leave a Comment