వింత ఘటన.. తోకతో పుట్టిన బాలుడు..!

కోతి నుంచి మనిషి పరిణామం చెందినట్లు చెబుతుంటారు. అప్పట్లో మనుషులకు తోకలు ఉండేవని, కాలక్రమేణా మార్పుల మూలంగా తోక లేకుండా పోయిందని పరిశోధకులు అంటుంటారు. రామాయణంలో కూడా హనుమంతుడు తోకతో ఉంటాడు.. అయితే తాజాగా బ్రెజిల్ లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ బాలుడు తోకతో పుట్టాడు..ఆ తోక 12 సెం.మీ పొడువు ఉంది. తోక చివర ఒక బంతి ఆకారం కూడా ఉంది..

ఫోర్టలేజాలోని ఆల్బర్ట్ సబిన్ చిల్డ్రన్ హాస్పిటల్ లో ఈ శిశువు జన్మించింది. ఆ సమయంలో తోక 12 సెం.మీ వరకు పెరిగి 4 సెం.మీ వ్యాసం కలిగిన బంతిని కలిగి ఉన్నట్లు మెడికల్ జర్నల్ తన నివేదికలో వెల్లడించింది. డాక్టర్లు శస్త్ర చికిత్స చేసి ఆ తోకను తొలగించారు. అయితే జన్యుపరమైన లోపాల కారణంగా పిల్లలు ఈ విధంగా పుడుతుంటారని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి అరుదైన కేసులు సుమారు 40 వరకు చూశామని చెప్పారు.    

 

Leave a Comment