‘రూ.30 లక్షలు ఇస్తే.. సెక్రటేరియట్ లో ఉద్యోగం పక్కా’..!

ప్రభుత్వ ఉద్యోగాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.. ప్రైవేట్ ఉద్యోగాలతో పోలిస్తే మెరుగైన శాలరీ ప్యాకేజీలు, ప్రోత్సాహకాలు మరియు ప్రయోజనాలు, తక్కువ పనిభారం, ఉద్యోగ భద్రత వంటివి ప్రభుత్వ ఉద్యోగాలకు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. అందుకే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని చదువుకున్న ప్రతిఒక్కరి ఒక కల ఉంటుంది.. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగం ఉంటే మంచి సంబంధాలు కూడా వస్తాయి.. మంచి కట్నం కూడా లభిస్తుంది. అందుకే కొదరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతైన లంచం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారు..అలాంటి వారినే కొందరు క్యాష్ చేసుకుంటారు..  

తాజాగా అలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. ఓ కేటుగాడు ఓ వ్యక్తికి గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానని రూ.30 లక్షలు వసూలు చేశాడు. రంగస్వామి అనే వ్యక్తి కొడుకు నాలుగేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. అయినా ఇంత వరకు ఉద్యోగం రాలేదు. రంగస్వామికి కన్నణ్ అనే స్నేహితుడు ఉన్నాడు. అతడు చెన్నై సెక్రటేరియట్ కాంప్లెక్స్ లో అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. 

రంగస్వామి తన కొడుకు ఉద్యోగ ప్రస్తావనను కన్నణ్ ముందు తీసుకొచ్చాడు. దీనిని విన్న కన్నణ్ క్యాస్ చేసుకోవాలనుకున్నాడు. సెక్రటేరియట్ లో ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపాడు. అయితే ఉద్యోగం కావాలంటే రూ.30 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడు. సెక్రటేరియట్ లో ప్రభుత్వ ఉద్యోగం వస్తే కొడుకు జీవితం సెటిల్ అవుందని భావించిన  రంగస్వామి విడతల వారీగా కన్నణ్ అడిగిన మొత్తాన్ని ఇచ్చాడు. డబ్బులు తీసుకున్న కన్నణ్ తర్వాత ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో రంగస్వామి తన స్నేహితుడు కన్నణ్ ను ప్రశ్నించారు. తన డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని అడిగాడు. దానికి కన్నణ్ ఒప్పుకోలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన రంగస్వామి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కన్నణ్ ని అరెస్ట్ చేశారు.  

Leave a Comment