ప్రధాని మోడీ కీలక నిర్ణయం.. రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరు మార్పు..!

ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రీడల్లో భారత అత్యున్నత పురస్కారమైన ‘రాజీవ్ ఖేల్ రత్న’ పేరున ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న’గా మార్చారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 

ఈ అవార్డు పేరు మార్చాలని దేశవ్యాప్తంగా తనుకు అనేక వినతులు వచ్చినట్లు ప్రధాని మోడీ తెలిపారు. వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు మీదుగా ఖేల్ రత్న అవార్డును 1991-92లో ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం క్రీడాకారులకు అవార్డులు ప్రకటిస్తారు.

 ఇప్పుడు రాజీవ్ పేరు తొలగించి భారత హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ పేరును పెట్టారు. ధ్యాన్ చంద్ కెప్టెన్సీలో భారత్ హాకీ జట్టు ఒలింపిక్స్ లో వరుసుగా మూడు సార్లు స్వర్ణ పతకాలు సాధించింది. ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. 

Leave a Comment