మిస్ ఇండియా రనర్నప్ గా ఆటో డ్రైవర్ కూతురు..!

విఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా 2020 విజేతగా తెలంగాణకు చెందిన ఇంజినర్ మానస వారణాసి ఎంపికైంది. మిస్ గ్రాండ్ ఇండియా 2020గా హర్యానాకు చెందిన మణికా షియోకాండ్ నిలవగా, మిస్ ఇండియా రన్నరప్ గా ఉత్తరప్రదేశ్ కు చెందిన మాన్య సింగ్ నిలిచింది. 

కాగా, మాన్య సింగ్ ఉత్తరప్రదేశ్ లోని కుషినగర్ లో ఓ సాదాసీదా కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ఓ ఆటో డ్రైవర్ గా పనిచేస్తారు. తల్లి ఇంట్లో పనిచేసుకుంటూ తన ఇద్దరు పిల్లలను చూసుకునేది. అయితే పేదరికం కారణంగా మాన్య కొద్దవరకే చదువుకుంది. ఆ తర్వాత ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. 

మాన్య సింగ్ డిగ్రీ ఫీజు కోసం తల్లి దగ్గర ఉన్న కొద్ది పాటి బంగారాన్ని సైతం తనఖా పెట్టాల్సి వచ్చింది. ఇంట్లో కష్టాలు చూడలేక మాన్య 14 ఏళ్లు ఉన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. రాత్రిపూట కాల్ సెంటర్ లో ఉద్యోగం చేసుకునేది. ఉదయం పూట చదువు కొనసాగించేదాన్ని అని మాన్య చెప్పింది. 

అంతేకాదు రిక్షా ఛార్జీలను ఆదా చేసుకోవడానికి నడుచుకుంటే వెళ్లేది. మిస్ ఇండియా పోటీల్లో గెలవాలని ఎన్నో తిండి, నిద్రలేని రాత్రులు గడిపానని మాన్య తెలిపింది. తన అమ్మా, నాన్న, అన్నయ్య తన కోసం పడ్డ కష్టం, వారు తనకు అందించిన సహకారం వల్లనే ఈ స్థానంలో నిలిచానని మాన్య చెప్పుకొచ్చింది.  

 

Leave a Comment