ఐపీఎల్ వేలంలో అర్జున్ టెండూల్కర్.. శ్రీశాంత్ కు దక్కని చోటు..!

ఐపీఎల్ వేలం 2021లో సచిల్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ చోటుదక్కించుకున్నాడు. ఈనెల 18న చెన్నైలో జరిగే ఈ వేలంలో ఫ్రాంచైజీ యాజమాన్యాల సూచన ప్రకారం మొత్తం 292 మంది క్రికెటర్లను బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. ఆల్ రౌండర్ విభాగంలో షార్ట్ లిస్ట్ చేసిన ఆటగాళ్లలో అర్జున్ టెండూల్కర్ రూ.20 లక్షల కనీస ధర వద్ద షార్ట్ లిస్ట్ చేయబడ్డాడు. 

కాగా ఈ వేలంలో పాల్గొనేందుకు మొత్తం 1114 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే వారికి 292 మందిని మాత్రమే షార్ట్ లిస్ట్ చేశారు. ఈ జాబితాలో కేరళ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ కు చోటు దక్కలేదు. కనీస రూ.2 కోట్ల జాబితాలో భారత్ నుంచి హర్భజన్, కేదార్ జాదవ్, విదేశాల నుంచి స్మిత్, మ్యాక్స్ వెల్ ఉన్నారు.

కాగా భారత టెస్ట్ స్పెషలిస్ట్ ఛతేశ్వర్ పూజారాను కూడా ఐపీఎల్ వేలానికి ఎంపిక చేశారు. రూ.50 లక్షల జాబితాలో పుజారా చోటుదక్కించుకున్నాడు. అయితే 2014 నుంచి పూజారా తన పేరును ఐపీఎల్ వేలంలో ఉంచుతున్నాడు. కానీ ఐపీఎల్ ఫ్రాంఛైజీలు మాత్రం పూజారాపై ఆసక్తి చూపడం లేపడం లేదు.  

Leave a Comment