చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు రూ.6 కోట్ల ట్యాక్స్ రద్దు చేసిన ప్రధాని మోడీ..!

ఓ చిన్నారి చికిత్స విషయంలో ప్రధాని మోడీ ఉదారం చూపారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి ప్రాణాలు కాపాడేందు ఏకంగా రూ.6 కోట్ల ట్యాక్స్ ను రద్దు చేశారు. వివరాల మేరకు ముంబైకి చెందిన ఐదు నెలల చిన్నారి తీరా కామత్ జన్యుపరమైన అరుదైన వ్యాధితో బాధపడుతోంది. 

ఈ పాపకు చికిత్స చేసేందుకు జన్యుమార్పిడి థెరపీ చేయాల్సి ఉంటుంది. దాని కోసం జోల్గెన్ స్మా అనే ఔషధాన్ని అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలి. ఆ ఔషధనం ఖరీదు రూ.16 కోట్లు ఉంటుంది. ఆ మందును దిగుమతి చేసుకునేందుకు రూ.6 కోట్ల రూపాయల జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. 

 

చిన్నారి తీరా కామత్ ఆపరేషన్ కోసం దాతల నుంచి రూ.16 కోట్లను ముంబైలోని కాతమ్ కుటుంబం సేకరించింది. ఈ ఖర్చుకు తోడు రూ.6 కోట్ల జీఎస్టీ భారం పడుతోంది. ఈ అదనపు భారాన్ని తగ్గించేందుకు ప్రధాని మోడీ చొరవ చూపారు. ఆ మందులపై జీఎస్టీ రద్దు చేశారు. దీంతో ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

ఆగస్టు 14, 2020లో చిన్నారి తీరా పుట్టింది. పుట్టిన రెండు వారాల తర్వాత ఆమెకు జన్యుపరమైన లోపం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పాలు తాగే సమయంలో ఈపాప ఊపిరి తీసుకోని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ వ్యాధికి సంబంధించి మందుల దిగుమతి కోసం అధిక జీఎస్టీ పడుతుండటంతో విషయాన్ని పాల తల్లి దండ్రులు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దృష్టికి తీసుకెళ్లారు. 

దీంతో మందుల దిగుమతిపై పన్నులను రద్దు చేయాలని ఆయన ప్రధాని మోడీని కోరారు. చిన్నారి తల్లిదండ్రులు ఖర్చును భరించే స్థితిలో లేరన్నారు. దీంతో లైఫ్ సేవింగ్ డ్రగ్ పై విధించే అన్ని పన్నులను తీరా విషయంలో రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తీరా తల్లిదండ్రులు ప్రియాంక, మిహిర్ కామత్ లు మోడీ ప్రకటన పట్ల ఆనందం వ్యక్తం చేశారు. 

Leave a Comment