స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ ఇకలేరు..!

ఫాస్ట్ పిచ్ అయినా.. స్పిన్ పిచ్ అయినా.. బంతిని గిర్రున బొంగరంలా తిప్పేస్తాడు. అతడు బంతి వేస్తే బ్యాట్స్ మెన్ క్రీజ్ లో నిల్చువాల్సిందే.. అలాంటి స్పిన్ మాంత్రికుడు.. ఆస్ట్రేలియా లెజెండ్ స్పిన్నర్ షేన్ వార్న్(52) శుక్రవారం హఠాన్మరణం చెందారు.. థాయ్ లాండ్ లోని కోహ్ సమూయ్ లో ఉన్న తన విల్లాలో తీవ్ర గుండెపోటుకు గురై మృతి చెందాడు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అతడిని ప్రాణాలతో కాపాడలేకపోయారు. 

కాగా శుక్రవారం ఉదయమే మరో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రాడ్ మార్ష్ మరణించాడు. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ షేన్ వార్న్ ట్వీట్ కూడా చేశాడు. దురదృష్టవశాత్తూ కొన్ని గంటల్లోనే షేన్ వార్న్ కూడా చినిపోవడం విషాదకరం.. షేన్ వార్న్ ఆకస్మిక మరణం క్రికెట్ ప్రపంచాన్ని షాక్ కి గురిచేసింది. షేన్ వార్న్ ఆస్ట్రేలియా తరపున 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. ఆల్ టైమ్ గ్రేట్ బౌలర్లలో షేన్ వార్న్ ఒకడిగా నిలిచాడు. 

షేన్ వార్న మైదానంలో గింగిరాలు తిరిగే బంతులతో బ్యాట్స్ మెన్ లను హడలెత్తిస్తాడు. వార్న్ కెరీర్ లో అలాంటి ఒక బంతి ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’గా  నిలిచిపోయింది. 1993లో యాషెస్ సిరీస్ లో భాగంగా మైక్ గాటింగ్ ను వార్న్ బౌట్ చేసిన తీరు చరిత్రలో నిలిచిపోయింది. 

Leave a Comment