వైసీపీ ప్రభుత్వంపై హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మందడంలో రాజధాని రైతులు నిర్వహించిన సభలో శివాజీ పాల్గొన్నాడు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీకి చెందిన 49 మంది ఎమ్మెల్యే, 9 మంది ఎంపీలు వేరే పార్టీతో టచ్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు.
విశాఖ ఉక్కు, అమరావతి, ప్రత్యేక హోదా ఏమైందని వైసీపీని శివాజీ ప్రశ్నించారు. ఈకాలంలో కూడా కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నలు వేశారు. వ్యాపారస్తులు రాజకీయాల్లోకి రావడం వల్లే అమరావతికి ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ప్రత్యేక హోదా గురించి సీఎం మాట్లాడిన మాటలు దారుణంగా ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో యువతకు చేపల కొట్లు, జొమాటో డెలవరీ బాయ్ ఉద్యోగాలే గతి అని శివాజీ వ్యాఖ్యానించారు. జగన్ సినిమా మొత్తం అయిపోయిందని, ఇక మూడు రాజధానులు పేరుతో ఎన్నికలకు వెళ్తాడని చెప్పారు. రాబోయే ఎన్నికట్లో సీఎం తన స్థానాన్ని గెలుచుకోవడానికి గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఓటుకు రూ.50 వేలు ఇచ్చినా ఈసారి వైసీపీ గెలిచే పరిస్థితి లేదని శివాజీ అన్నారు.