మాస్క్ పెట్టుకోవాలని అడిగినందుకు.. మున్సిపల్ వర్కర్ పై దాడి..

మహారాష్ట్రలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని ప్రభుత్వం సూచించింది. ముంబైలో మాస్క్ ధరించకుండా బయటకు వస్తే రూ.200 జరిమానా కూడా విధిస్తోంది. అయితే ఓ మహిళ కాండివలీ రోడ్డు మార్గంలో మాస్క్ లేకుండా కనిపించింది. దీంతో ఆ మహిళను స్థానిక మున్సిపల్ వర్కర్ అడ్డుకుంది. మాస్క్ పెట్టుకోవాలని ఆ మహిళను కోరింది.

ఆ సమయంలో మున్సిపల్ కార్మికురాలిపై ఆ మహిళ దాడి చేసంది. కార్మికురాలిపై చేయి చేసుకుంది. దీంతో మహిళను వెళ్లనివ్వకుండా గట్టిగా పట్టుకోవడంతో మున్సిపల్ వర్కర్ పై ఆ మహిళ భీకరంగా దాడి చేసింది. ఆటోలో నుంచి బయటకు దిగి వర్కర్ ను ఇష్టం వచ్చినట్లు కొట్టింది. ఈ ఘటనను ఓ వ్యక్తి తన మొబైల్ లో వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Leave a Comment