దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దేశవ్యాప్తంగానే కాదు.. అంతర్జాతీయంగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మూడు నెలల క్రితం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన ఆర్ఆర్ఆర్ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ తర్వాత ఓటీటీలో రావడంతో ఈ సినిమా రేంజ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. ప్రపంచం మొత్తం ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది.
ఈ సినిమాపై పలువురు హాలీవుడ్ డైరెక్టర్లు, రైటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా టాప్ లో నిలిచింది. తాజాగా ఓ ప్రముఖ ఇజ్రాయెల్ పత్రిక ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా ఓ ఆర్టికల్ రాసింది. ఈ ఆర్టికల్ కి సంబంధించిన క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వార్తలో కొమరం భీముడి పాత్రలో ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా రాశారు. కథనంతో పాటు ప్రచురించిన రెండు ఫొటోలు ఎన్టీఆర్ వే కావడం విశేషం.. ‘హాలీవుడ్ మరచిపోయింది ఇదే’ అంటూ హెడ్డింగ్ పెట్టీ మరీ ఆ పత్రికలో ఆర్ఆర్ఆర్ ను ప్రశంసించారు. ప్రస్తుతం ఈ ఆర్టికల్ వైరల్ అవుతుండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో సంతోషంలో ఉన్నారు.
View this post on Instagram
#RRR scenes are extremely well-tailored. Especially this one. #JrNTR is OUTSTANDING.#RRRMovie @tarak9999 pic.twitter.com/q1MFWvzVff
— Nishit Shaw (@NishitShawHere) June 13, 2022